![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 352 లో... రంగనాధం అసిస్టెంట్ వీరుకి ఫోన్ చేసి మా గురువు గారిని మీరే చంపారు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది.. మీరు గనుక ఇవ్వకుంటే ఆ నిజం అందరికి చెప్తానని అతను బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో వీరు అతనిపై కోప్పడుతాడు. వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ రుద్ర ఉంటాడు. ఏంటి వీరు ఏదో టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు.
ఏం లేదని వీరు అంటాడు ఏదో రంగనాథం గారు అని అంటున్నావని రుద్ర అంటాడు. ఏం లేదని వీరు కవర్ చేస్తాడు. మరొకవైపు ఆషాడం కదా అందరు గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే సుధా జయని కూడా పిలుద్దామని సుధాకి పెద్దసారు ఫోన్ చేస్తాడు. శకుంతలకి ఇచ్చి పిలవమని చెప్తాడు. దాంతో శకుంతల ఇష్టం లేకున్నా సరే శకుంతల పిలుస్తుంది. ఆ తర్వాత విశ్వని కూడా రమ్మని సుధా అడుగుతుంది. నేను రానని విశ్వ చెప్తాడు. దాంతో జయని తీసుకొని సుధా బయలుదేర్తుంది. మరొకవైపు గంగ, రంగా కలిసి గోరింటాకు దొంగతనంకి వెళ్తారు.
మరొకవైపు జయ కోసం వంశీ వెయిట్ చేస్తాడు. దాంతో తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత జయని తీసుకొని సుధా వస్తుంది. చాలా థాంక్స్ వదిన నాతో ప్రేమగా ఉంటున్నందుకు నీ చేత్తో గోరింటాకు పెట్టమని సుధా అడుగుతుంది. శకుంతలకి ఇష్టం లేకున్నా సరే అంటుంది. గంగ ఎక్కడ కన్పించడం లేదు తన చేత్తో కాఫీ కావాలని సుధా అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |